Ambati Rambabu: అంబటి, బుద్దా వెంకన్న మధ్య ట్వీట్ వార్

Tweet war between Ambati and Budda Venkanna

  • మంత్రులకు నిన్న ర్యాంకులు ప్రకటించిన చంద్రబాబు
  • 8, 9 ర్యాంకులు సాధించిన లోకేశ్, పవన్ లకు అభినందనలు అంటూ అంబటి ట్వీట్
  • మీ జగన్ వచ్చే ఎన్నికల్లో ఒక్క స్థానానికి వచ్చేందుకు కృషి చేస్తున్నారంటూ వెంకన్న ఎద్దేవా

ఏపీ మంత్రులకు సీఎం చంద్రబాబు నిన్న ర్యాంకులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ర్యాంకింగ్స్ లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేశ్ కు వచ్చిన ర్యాంకులపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైరిక్ గా ట్వీట్ చేశారు. 'మంత్రివర్గపు ర్యాంకుల్లో 8, 9 స్థానాలను సాధించిన లోకేశ్, పవన్ లకు అభినందనలు' అని ట్వీట్ చేశారు.

దీనిపై బుద్దా వెంకన్న స్పందిస్తూ... 'అయ్యా అంబటి... 1, 2 స్థానాల్లోకి రావడానికి పవన్, లోకేశ్ కృషి చేస్తున్నారు. 11 స్థానాలతో ఉన్న మీ జగన్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో ఒక్క స్థానానికి వచ్చేందుకు మరింత కృషి చేస్తున్నారు' అంటూ ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News