Naga Chaitanya: శోభిత పోస్టుకు చైతూ ఆసక్తికర రిప్లై.. మీ బాండింగ్ చాలా బాగుందంటూ నెటిజన్ల కామెంట్స్!

అక్కినేని నాగచైతన్య, చందు మొండేటి కాంబినేషన్‌లో తెరకెక్కిన తండేల్ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా నాగచైతన్య అర్ధాంగి శోభిత ధూళిపాళ్ల చిత్ర బృందానికి విషెస్ చెబుతూ ఇన్‌స్టా వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు.
ఈ సినిమాపై చైతూ చాలా దృష్టి సారించారని, చేస్తున్నన్ని రోజులు పాజిటివ్‌గా ఉన్నారని పేర్కొన్నారు. "ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ" అంటూ చైతూను ఉద్దేశిస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ఈ మూవీ కోసం చాలా రోజులుగా ఆయన గడ్డం లుక్‌లోనే ఉన్న విషయం తెలిసిందే.
ఇక భార్య తనను ఉద్దేశించి చేసిన పోస్టుపై నాగచైతన్య స్పందించారు. "థ్యాంక్యూ మై బుజ్జి తల్లి" అని రిప్లై ఇచ్చారు. దీంతో ఈ పోస్టు కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై మీ బాండింగ్ చాలా బాగుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, శోభిత, నాగచైతన్య గతేడాది డిసెంబర్ 4న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
