Allu aravind: తండేల్ టికెట్ ధరలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరలేదు: నిర్మాత అల్లు అరవింద్

- తండేల్ సినిమా టికెట్ ధరలు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నే అడిగామన్న అరవింద్
- తెలంగాణలో టికెట్ ధరలు పెరిగే ఉన్నందున ధరలు పెంచాలని కోరలేదని వివరణ
- నేడు ప్రేక్షకుల ముందుకు వస్తున్న తండేల్
తండేల్ సినిమాకు టికెట్ ధరలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరలేదని నిర్మాత అల్లు అరవింద్ స్పష్టం చేశారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'తండేల్' చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించగా, అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు.
సినిమా విడుదల సందర్భఁగా చిత్ర బృందం గురువారం విలేఖరులతో మాట్లాడింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరలు తక్కువగా ఉన్నందున అక్కడ మాత్రమే టికెట్ ధరలను పెంచాలని కోరినట్లు, అది కూడా టికెట్‌పై రూ.50 మాత్రమే పెంచమని అభ్యర్థించినట్లు తెలిపారు. తెలంగాణలో టికెట్ ధరలు ఇప్పటికే రూ.295, 395గా ఉన్నందున, ఇక్కడ టికెట్ ధరల పెంపు గురించి ప్రభుత్వాన్ని కోరలేదని ఆయన పేర్కొన్నారు.