Kanna Ravi: ఓటీటీకి రొమాంటిక్ కామెడీ సిరీస్!

Madurai Paiyanum Chennai Ponnum Web Series Update

  • తమిళనాడు నేపథ్యంలో సాగే కథ 
  • 25 ఎపిసోడ్స్ గా రూపొందిన సిరీస్ 
  • దర్శకుడిగా వ్యవహరించిన విఘ్నేశ్ పళనివేల్
  • ఈ నెల 14వ తేదీ నుంచి 'ఆహా తమిళ్'లో స్ట్రీమింగ్


ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లపై ఒక వైపున థ్రిల్లర్ చిత్రాలు .. మరో వైపున ఫ్యామిలీ ఎంటర్టైనర్ లు సందడి చేస్తున్నాయి. అప్పుడప్పుడు రొమాంటిక్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. అలా ఇప్పుడు 'ఆహా తమిళ్' ఫ్లాట్ ఫామ్ పైకి మరో రొమాంటిక్ వెబ్ సిరీస్ వస్తోంది .. ఆ సిరీస్ పేరే 'మధురై పయనుమ్ చెన్నై పొన్నుమ్'. విఘ్నేశ్ పళనివేల్ దర్శకత్వం వహించిన సిరీస్ ఇది. 

'ఆహా తమిళ్'లో ఈ నెల 14వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. కన్నారవి - ఏంజిలిన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, కామెడీ టచ్ తో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నడవనుంది. 'వాలెంటైన్స్ డే' సందర్భంగా ఈ సిరీస్ ను అందిస్తున్నారు. 25 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్ కి సాచిన్ రాజ్ సంగీతాన్ని అందించాడు. 

మధురైకి చెందిన అబ్బాయి .. చెన్నై కి చెందిన అమ్మాయి ప్రేమించుకుంటారు. అయితే వారి అభిప్రాయాలు .. అలవాట్లు భిన్నంగా ఉంటాయి. అలాంటప్పుడు అలకలు .. బుజ్జగింపులు మామూలే. అలా వాళ్ల ప్రయాణంలో చోటుచేసుకునే చిత్రమైన సన్నివేశాలతో ఈ కథ నడుస్తుంది. ప్రతి శుక్ర - శని - ఆదివారాలలో కొత్త ఎపిసోడ్స్ యాడ్ అవుతూ ఉంటాయి.

Kanna Ravi
Vighnesh
Madurai Paiyanum Chennai Ponnum Web Series
  • Loading...

More Telugu News