Amaravati: అమరావతిలో పనులకు అభ్యంతరం లేదన్న కేంద్ర ఎన్నికల సంఘం

EC gives no objection for Amaravati works

  • ఏపీలో ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు
  • అమల్లో ఉన్న కోడ్
  • పనులకు అనుమతి కోరుతూ ఈసీకి లేఖ రాసిన సీఆర్డీఏ
  • అనుమతి ఇస్తూ తిరిగి లేఖ రాసిన ఈసీ

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం తియ్యని కబురు చెప్పింది. అమరావతిలో పనులకు అభ్యంతరం లేదని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు టెండర్లు పిలిచేందుకు అనుమతి ఇస్తూ సీఆర్డీఏకి ఈసీ లేఖ రాసింది. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా సీఆర్డీఏ రాసిన లేఖకు స్పందనగా ఈసీ తాజాగా లేఖ పంపింది. 

ఫిబ్రవరి 27న రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కృష్ణా-గుంటూరు, తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేషన్ స్థానాలకు... విజయనగరం-శ్రీకాకుళం-విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవలే షెడ్యూల్ కూడా విడుదలైంది.

  • Loading...

More Telugu News