Big Boss Shekar Basha: బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషాకు మరిన్ని చిక్కులు.. మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు

Woman choreographer complaing on Big Boss Shekhar Basha

  • లావణ్య కేసులో ఇప్పటికే శేఖర్ బాషాపై కేసు
  • తాజాగా ఆయనపై ఫిర్యాదు చేసిన కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ
  • కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు పెట్టింది కూడా శ్రేష్టి వర్మే

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య వ్యవహారంలో బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషా చేసిన ఆరోపణలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. డబ్బు కోసమే లావణ్య ఇదంతా చేస్తోందని శేఖర్ బాషా ఆరోపించాడు. ఈ క్రమంలో శేఖర్ బాషాపై లావణ్య కేసు పెట్టింది. ఓవైపు ఇది జరుగుతుండగానే... బాషాపై మరో కేసు నమోదయింది. 

శేఖర్ బాషాపై మహిళా అసిస్టెంట్ కొరియాగ్రాఫర్ శ్రేష్టి వర్మ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు పెట్టింది కూడా శ్రేష్టి వర్మ కావడం గమనార్హం. జానీ మాస్టర్ కేసులో విచారణ జరుగుతున్న సమయంలో తన వ్యక్తిగత కాల్ రికార్డును శేఖర్ బాషా లీక్ చేశాడని తన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. తన పరువుకు భంగం కలిగేలా యూట్యూబ్ ఛానల్స్ లో మాట్లాడుతున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఉద్దేశపూర్వకంగానే ప్రైవేట్ కాల్స్ లీక్ చేశాడని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. బీఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 79, 67, ఐటీ యాక్ట్ 72 కింద శేఖర్ బాషాపై కేసు నమోదు చేశారు. 

Big Boss Shekar Basha
Case
  • Loading...

More Telugu News