Team India: తొలి వన్డే: టాస్ ఓడిన టీమిండియా

Team India loses toss in 1st ODI

  • టీమిండియా, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • తొలి వన్డేకి కోహ్లీ దూరం

టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు నాగ్ పూర్ లో తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 8 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు వికెట్ నష్టపోకుండా 71 పరుగులు. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ 40, బెన్ డకెట్ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడడంలేదు. కోహ్లీ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడని కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ సమయంలో వెల్లడించాడు. మహ్మద్ షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా పేస్ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనుండగా... రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ స్పిన్నర్లు. 

అటు, ఇంగ్లండ్ దాదాపు టీ20 సిరీస్ లో ఆడిన జట్టుతోనే బరిలో దిగింది. కాగా, ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్, పేసర్ హర్షిత్ రాణా అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో అరంగేట్రం చేస్తున్నారు. 

Team India
1st ODI
Toss
England
Nagpur
  • Loading...

More Telugu News