Unni Mukundan: థియేటర్లో కాసుల వర్షం కురిపించిన యాక్షన్ థ్రిల్లర్ .. ఓటీటీలో!

Marco Movie Update

  • ఉన్నిముకుందన్ హీరోగా రూపొందిన 'మార్కో'
  • డిసెంబర్లో థియేటర్లకు వచ్చిన సినిమా 
  • 115 కోట్లకి పైగా వసూలు చేసిన కంటెంట్ 
  • ఈ నెల 14 నుంచి 'సోనీ లివ్' లో స్ట్రీమింగ్ 


మలయాళంలో క్రితం ఏడాది చివరిలో విజయాన్ని సాధించిన చిత్రాల జాబితాలో 'మార్కో' ఒకటిగా కనిపిస్తుంది. డిసెంబర్ 20వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. ఉన్ని ముకుందన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి హనీఫ్ అదేని దర్శకత్వం వహించాడు. అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'సోనీలివ్' వారు దక్కించుకున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా ప్రకటించారు.  

మలయాళంలో ఈ సినిమాను 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అలాంటి ఈ సినిమా 115 కోట్ల వరకూ  వసూళ్లను రాబట్టింది. ఉన్ని ముకుందన్ కెరియర్లో ఇది బిగ్గెస్ట్ హిట్ గా చెబుతారు. సిద్ధికీ .. జగదీశ్ .. కబీర్ దుహాన్ సింగ్ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. రవి బస్రూర్ సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచిందనే టాక్ వినిపించింది. మరి ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ము రాబడుతుందో చూడాలి. 

కథ విషయానికి వస్తే .. కొచ్చిన్ లో జార్జ్ గోల్డ్ సిండికేట్ ను నిర్వహిస్తూ ఉంటాడు. అతని తమ్ముడు విక్టర్ పుట్టుకతోనే అంధుడు. అతణ్ణి అత్యంత కిరాతకంగా రసెల్ ఐసాక్ హత్య చేస్తాడు. ఈ హత్య చేసినవారెవరో కనుక్కుని అంతం చేయడం కోసమే 'మార్కో' ఎంట్రీ ఇస్తాడు. ఐసాక్ ఎవరు? విక్టర్ ను ఎందుకు చంపాడు? విక్టర్ కీ .. మార్కోకి ఉన్న సంబంధం ఏమిటి? అనేది కథ. ఈ సినిమా భారీ లాభాలను సాధించింది. అయితే హింస .. రక్తపాతం మితిమీరిపోయాయనే విమర్శ మాత్రం బలంగా వినిపించింది. 

  • Loading...

More Telugu News