Gold Smuggling: పది కిలోల బంగారు నాణాలతో పట్టుబడ్డ ప్రయాణికులు

Two Smugglers Caught In Delhi Airport With 10 kg Gold

  • ఢిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీ
  • మిలాన్ నుంచి దేశానికి బంగారం స్మగ్లింగ్
  • ఇద్దరు కశ్మీరీ యువకులను అరెస్టు చేసిన అధికారులు

బెల్టులో రహస్యంగా బంగారు నాణాలను దాచి తీసుకొచ్చిన ఇద్దరు ప్రయాణికులను ఢిల్లీ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మిలాన్ నుంచి వచ్చిన ఈ ప్రయాణికుల నుంచి పది కిలోల బంగారు నాణాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి జరిపిన తనిఖీలలో ఈ స్మగ్గింగ్ దందా బయటపడిందని ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులు చెప్పారు.

ఇటలీలోని మిలాన్ నుంచి వచ్చిన విమానంలో ఇద్దరు ప్రయాణికుల ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు తనిఖీ చేశారు. లగేజీ క్షుణ్ణంగా సోదా చేసినా ఏమీ కనిపించలేదు. దీంతో మరోసారి తనిఖీ చేయగా.. ప్రత్యేకంగా డిజైన్ చేసిన బెల్టులు కనిపించాయని అధికారులు తెలిపారు. వాటిలో రహస్యంగా దాచి తీసుకొచ్చిన బంగారు నాణాలు బయటపడ్డాయని చెప్పారు.

వాటిని తూకం వేయగా 10.092 కిలోలు ఉన్నాయని, మార్కెట్ లో ఆ నాణాల విలువ రూ.7.8 కోట్లకు పైనే ఉంటుందని తెలిపారు. ఈ బంగారు నాణాలకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేసి, ప్రయాణికులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పట్టుబడ్డ ప్రయాణికులు ఇద్దరూ కశ్మీర్ కు చెందిన వారేనని అధికారులు తెలిపారు.

Gold Smuggling
Gold Coins
Delhi Airport
Milan
Italy
  • Loading...

More Telugu News