Nara Lokesh: ప్రశాంత్ కిశోర్ ని కలిశాను: నారా లోకేశ్

I met Prashant Kishor says Nara Lokesh

  • ఢిల్లీ పర్యటన వివరాలను మీడియాకు వివరించిన నారా లోకేశ్
  • విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ ఇచ్చినందుకు కుమారస్వామికి ధన్యవాదాలు తెలిపానని వెల్లడి
  • ఫీడ్ బ్యాక్ కోసం ప్రశాంత్ కిశోర్ ను కలిశానన్న లోకేశ్

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేశ్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన పర్యటన వివరాలను పంచుకున్నారు. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి కేంద్ర మంత్రులకు వివరించానని చెప్పారు. పలు శాఖలపై వారితో చర్చించానని తెలిపారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆరా తీశారని.... కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులను త్వరగా ఇవ్వాలని కోరానని చెప్పారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ ఇచ్చినందుకు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిసి ధన్యవాదాలు తెలిపానని లోకేశ్ వెల్లడించారు. రాష్ట్రంలో ఐటీ, రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాలను విస్తరింపజేస్తామని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలను ఇస్తామనే హామీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు. 

హిందూ దేవాలయాల్లో ఇతర మతాచారాలు పాటించే వారిని తప్పించడం సాధారణ అంశమేనని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైన అందరినీ కలుస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనపై ఫీడ్ బ్యాక్ తీసుకోవడానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను కూడా కలిశానని చెప్పారు.

Nara Lokesh
Telugudesam
Kumaraswamy
JDS
Prashant Kishor
  • Loading...

More Telugu News