Somireddy Chandra Mohan Reddy: జగన్ 2.0 ప్రోగ్రామ్ 0.5 గా మారిపోతుందేమో: జగన్ కు సోమిరెడ్డి కౌంటర్

- 2.0 వైసీపీకి లాస్ట్ వర్షన్ అన్న సోమిరెడ్డి
- నీ పార్టీ క్లోజ్ కాకుండా చూసుకో అని మండిపాటు
- ఏ2 కూడా నిన్ను వదిలేశాడని ఎద్దేవా
జగన్ 2.0ని చూస్తారంటూ వైసీపీ అధినేత చేసిన వ్యాఖ్యలపై కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 30 ఏళ్లు తాను సీఎంగా ఉంటానని ఆయన అన్నారు. వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్న వారిని వదిలిపెట్టబోనని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ... జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
"జగన్ లండన్ నుంచి దిగినట్టున్నాడు. 2.0 ప్రోగ్రామ్ అంట. బహుశా అది 0.5గా మారిపోతుందేమోనని డౌట్ వస్తా ఉంది. 2.0 వైసీపీకి లాస్ట్ వర్షన్. కూటమి ప్రభుత్వం వచ్చింది. లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు వస్తున్నారు. తల్లి, చెల్లిని కూడా దూరం చేసుకున్నోడివి. నీవు మా సంగతి చూస్తావా? ముందు నీ సంగతి చూసుకో. నీ పార్టీ క్లోజ్ కాకుండా చూసుకో. ఆ తర్వాత మా సంగతి చూద్దువుకాని. నిన్ను ఎవరు నమ్మేది? నీతో పాటు 16 నెలలు జైల్లో ఉన్న ఏ2 కూడా నిన్ను వదిలేశాడు. ఈ బెదిరింపులు పక్కన పెట్టు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.