Harish Rao: అప్పటి వరకు హరీశ్ రావును అరెస్ట్ చేయవద్దు: తెలంగాణ హైకోర్టు

Telangana High Court orders on Harish Rao arrest

  • హరీశ్ రావును 12వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దంటూ ఉత్తర్వులు పొడిగింపు
  • తదుపరి విచారణను 12వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు
  • ఫోన్ ట్యాపింగ్ కేసును క్వాష్ చేయాలంటూ హరీశ్ రావు పిటిషన్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ నెల 12వ తేదీ వరకు హరీశ్ రావును అరెస్ట్ చేయవద్దని హైకోర్టు పేర్కొంది. హరీశ్ రావును అరెస్ట్ చేయవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈరోజు మరోసారి పొడిగించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టివేయాలంటూ హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం హరీశ్ రావును అరెస్ట్ చేయవద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.

  • Loading...

More Telugu News