Samudrakhani: నిజాయతీపరుడికి ఎదురైన డబ్బు పరీక్ష .. ఓటీటీలో దూసుకుపోతున్న 'తిరు మాణికం'!

Thiru Manickam Movie Special

  • 'తిరు మాణికం'గా సముద్రఖని
  • డిసెంబర్ లో విడుదలైన సినిమా 
  • జనవరి 24 నుంచి మొదలైన స్ట్రీమింగ్ 
  • ఆలోచింపజేసే కంటెంట్ 
  • ఓటీటీ వైపు నుంచి లభిస్తున్న ఆదరణ   

         
తెలుగు .. తమిళ భాషల్లో సముద్రఖనికి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. కేరక్టర్ ఆర్టిస్టుగా .. మెయిన్ విలన్ గా మాత్రమే కాదు, ఆయన ప్రధాన పాత్రధారిగా కూడా సినిమాలు నిర్మితమవుతున్నాయి. అలా తమిళంలో రూపొందిన సినిమానే 'తిరు మాణికం'. నంద పెరియస్వామి దర్శకత్వం వహించిన సినిమా ఇది. 

క్రితం ఏడాది డిసెంబర్ 27వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. జనవరి 24వ తేదీ నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు కన్నడ .. మలయాళ భాషలలో మాత్రమే ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. కంటెంట్ పరంగా ఓటీటీలో ఈ సినిమా దూసుకుపోతోందని సమాచారం. భారతీరాజా .. అనన్య కీలకమైన పాత్రలను పోషించారు. ఆర్య .. పార్తీబన్ .. పా విజయ్ వంటి ఆర్టిస్టులు గెస్టు పాత్రలలో మెరవడం విశేషం. 

కథ విషయానికి వస్తే .. మాణికం ఒక లాటరీ షాపు నడుపుతూ ఉంటాడు. అతను మంచి నిజాయతీ పరుడు. ఒకసారి అతని షాపులో ఒక వృద్ధుడు ఒక లాటరీ టికెట్ కొంటాడు. ఆ తరువాత డబ్బులు లేవని చెప్పి .. మళ్లీ వచ్చి తీసుకుంటానని చెబుతాడు. ఆ టికెట్ కి కోటిన్నర లాటరీ తగులుతుంది. ఆ డబ్బును అతనికి అందజేయాలనుకున్న మాణిక్యాన్ని ఎలాంటి పరిస్థితులు చుట్టుముడతాయనేది కథ. త్వరలో తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

  • Loading...

More Telugu News