Web Series: ఇల్లు కట్టడం అంత వీజీ కాదయా .. హాట్ స్టార్ లో రొమాంటిక్ కామెడీ సిరీస్!

- అజూ వర్గీస్ నుంచి మరో వెబ్ సిరీస్
- 7 భాషలలో జరగనున్న స్ట్రీమింగ్
- సొంత ఇంటి ఏర్పాటు చుట్టూ తిరిగే కథ
- ఈ నెల 14 నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్
మలయాళ కథలకు సినిమాల వైపు నుంచి ఎంత క్రేజ్ ఉందో, ఓటీటీవైపు నుంచి మలయాళ సిరీస్ లకు అంతే డిమాండ్ ఉంది. అందువలన మలయాళ కంటెంట్ వివిధ భాషల్లో ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తోంది. అలా త్వరలో ప్రేక్షకులను పలకరించనున్న వెబ్ సిరీస్ గా 'లవ్ అండర్ కన్ స్ట్రక్షన్' కనిపిస్తోంది.
రెంజిత్ నిర్మించిన ఈ సిరీస్ కి విష్ణు జి. రాఘవన్ దర్శకత్వం వహించాడు. అజూ వర్గీస్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ స్ట్రీమింగ్ హక్కులను 'హాట్ స్టార్' వారు దక్కించుకున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ .. బెంగాలీ .. మరాఠీ భాషలలో ఇది ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
ఒక జంట సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటుంది. సొంత ఇల్లు ఆనందాన్ని .. భరోసాను ఇస్తుంది గనుక, గట్టిగానే ప్రయత్నాలు చేస్తారు. ఇల్లు కట్టుకోవడానికి రంగంలోకి దిగుతారు. ఆ తరువాత వాళ్లు ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ. నీరజ్ మాధవ్ .. గౌరీ కిషన్ .. కిరణ్ పీతాంబరన్ .. ఆనంద్ మన్మథన్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.
