Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మహిళా క్రికెటర్ గొంగడి త్రిష

- ఐసీసీ అండర్-19 టీ20 ప్రపంచ కప్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన త్రిష
- త్రిషకు రూ.1 కోటి నజరానా ప్రకటించిన రేవంత్ రెడ్డి
- మరో ముగ్గురికి రూ.10 లక్షల చొప్పున ప్రకటించిన ముఖ్యమంత్రి
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణి గొంగడి త్రిషకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.1 కోటి నజరానా ప్రకటించారు. అండర్-19 ప్రపంచ కప్ జట్టులోని మరో సభ్యురాలు ధృతి కేసరి, జట్టు ప్రధాన కోచ్ నౌషీన్, శిక్షకురాలు షాలినిలకు రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని అందజేయనున్నట్లు తెలిపారు.
గొంగటి త్రిష ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను సత్కరించారు. భవిష్యత్తులో దేశం తరఫున మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. టీ20 ప్రపంచ కప్ టోర్నీ ఆరంభం నుండి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో త్రిష భారత్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది.