Shine Tom Chocko: శృంగార పురుషుడికి గుణపాఠం: ఆహాలో 'వివేకానందన్ వైరల్' మూవీ!

Vivekanandan Viral Movie Update

  • మలయాళంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ మూవీ
  • ఒక హీరో .. ఐదుగురు హీరోయిన్స్  
  • క్రితం ఏడాది జనవరిలో విడుదలైన సినిమా
  • ప్రధానమైన పాత్రను పోషించిన షైన్ టామ్ చాకో  
  • ఈ నెల 7 నుంచి తెలుగులో అందుబాటులోకి


మలయాళంలో షైన్ టామ్ చాకోకి మంచి క్రేజ్ ఉంది. చాలా సింపుల్ గా కనిపిస్తూనే పవర్ ఫుల్ విలనిజం పండించడం ఆయన ప్రత్యేకత. అలాంటి ఆయన డిఫరెంట్ కంటెంట్ తో కూడిన 'వివేకానందన్ విరలను' సినిమాను చేశాడు. క్రితం ఏడాది జనవరి 19వ తేదీన ఈ సినిమా అక్కడి థియేటర్లలో విడుదలైంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. 

ఈ సినిమాలో షైన్ టామ్ చాకో సరసన ఐదుగురు హీరోయిన్స్ కనిపిస్తారు. శ్వాసిక విజయ్ .. గ్రేస్ ఆంటోని .. మెరీనా మైఖేల్ .. రమ్య సురేశ్ .. మంజు పిళ్లై ముఖ్యమైన పాత్రలను పోషించారు. కామెడీ డ్రామా జోనర్లో రూపొందిన ఈ సినిమాకి సీనియర్ దర్శకుడు కమల్ దర్శకత్వం వహించాడు. అలాంటి ఈ సినిమా ఇపుడు 'వివేకానందన్ వైరల్' పేరుతో ఈ నెల 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కూడా వదిలారు.     

ఈ సినిమా కథ విషయానికి వస్తే .. వివేకానందన్ మంచి విలాస పురుషుడు .. ఆపై శృంగార పురుషుడు. ఆయన భార్య సితార ఓ పల్లెటూళ్లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉంటుంది. తన జాబ్ సిటీలో కావడం .. భార్య ఇంట్లో లేకపోవడంతో వివేకానందన్ అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ ఉంటాడు. అతని నిజస్వరూపం తెలుసుకున్న వాళ్లంతా కలిసి ఏం చేస్తారు? వివేకానందన్ ఎలాంటి చిక్కుల్లో పడతాడు? అనేది కథ.

  • Loading...

More Telugu News