Pushpa 2: నెట్‌ఫ్లిక్స్‌లోనూ దూసుకెళ్తున్న 'పుష్ప-2'

- జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'పుష్ప-2'
- ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి వ్యూస్ పరంగా టాప్‌లో ఉన్న మూవీ
- తాజాగా ఏడు దేశాల్లో నం.1 స్థానం కైవసం
- వరల్డ్‌వైడ్‌గా ఇంగ్లిషేతర సినిమాల విభాగంలో 5.8 మిలియన్ల వ్యూస్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో రెండో స్థానం
థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించిన 'పుష్ప-2: ది రూల్' సినిమా ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంటోంది. ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి వ్యూస్ పరంగా టాప్‌లో ఉన్న 'పుష్ప-2' తాజాగా ఏడు దేశాల్లో నం.1 స్థానాన్ని కైవసం చేసుకుంది.
అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిషేతర సినిమాల విభాగంలో 5.8 మిలియన్ల వ్యూస్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో రెండో స్థానంలో ట్రెండ్ అవుతోంది. రీలోడెడ్ వర్షన్‌తో ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ నిడివి దాదాపు 3 గంటల 40 నిమిషాలు. థియేటర్లలో గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా రూ. 1850కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే.