Samyuktha Menon: కుంభమేళాలో టాలీవుడ్ బ్యూటీ

- త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించిన సంయుక్త మీనన్
- మనసు మరింత తేలిక పడిందన్న మలయాళీ భామ
- ప్రస్తుతం హీరోయిన్ సెంట్రిక్ మూవీలో నటిస్తున్న సంయుక్త
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ బ్యూటీ సంయుక్త మీనన్ కూడా త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించింది.
పుణ్య స్నానం ఆచరించిన ఫొటోను సోషల్ మీడియాలో సంయుక్త మీనన్ పంచుకుంది. జీవితానికి మించిన విశాలతను మనం చూసినప్పుడు... జీవితం తన అర్థమేమిటో వెల్లడిస్తుందని సంయుక్త పోస్ట్ చేసింది. కుంభమేళాలో పవిత్ర గంగా నదిలో స్నానం చేస్తున్నప్పుడు తన మనసు మరింత తేలికపడిందని తెలిపింది. సినిమాల విషయానికి వస్తే... తొలిసారి హీరోయిన్ సెంట్రిక్ మూవీలో సంయుక్త నటిస్తోంది. ఈ సినిమాకు రానా దగ్గుబాటి క్లాప్ కొట్టారు.
