Rahul Dravid: టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ కారుకు ప్రమాదం.. వీడియో ఇదిగో!

Accident to Rahul Dravid car

  • ద్రావిడ్ కారును ఢీకొన్న ఆటో
  • ఆటో డ్రైవర్ తో ద్రావిడ్ వాగ్వాదం
  • బెంగళూరులో చోటుచేసుకున్న ప్రమాదం

టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ ద్రావిడ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ద్రావిడ్ ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొంది. ఈ ప్రమాదం బెంగళూరులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్రావిడ్ కు గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం అనంతరం ఆటో డ్రైవర్ తో ద్రావిడ్ వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ప్రమాదం జరిగిన సమయంలో కారును ద్రావిడ్ స్వయంగా డ్రైవ్ చేస్తున్నట్టు వీడియో ద్వారా అర్థమవుతోంది. ద్రావిడ్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశారా? లేక ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశాడా? అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ద్రావిడ్ కు ఆటో డ్రైవర్ ఏదో వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుండటం వీడియోలో కనిపిస్తోంది. అయితే, ఈ ఘటనపై ఇద్దరిలో ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

Rahul Dravid
Team India
Car Accident

More Telugu News