Nara Brahmani: నేను, తేజు మా నాన్నని అపార్థం చేసుకున్నాం: నారా బ్రాహ్మణి

- నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన సందర్భంగా ట్రీట్ ఇచ్చిన నారా భువనేశ్వరి
- తండ్రి బాలకృష్ణ మనస్తత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పెద్ద కుతూరు బ్రాహ్మణి
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బ్రాహ్మణి వ్యాఖ్యలు
నందమూరి బాలకృష్ణ మనస్తత్వంపై ఆయన పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన సోదరి నారా భువనేశ్వరి ఇటీవల సోదరుడికి ట్రీట్ ఇచ్చారు.
ఈ పార్టీలో నందమూరి, నారా కుటుంబ సభ్యులు పాల్గొనగా, నందమూరి బాలకృష్ణ మీద ప్రతి ఒక్కరూ తమ తమ అభిప్రాయాలు పంచుకోవాలని భువనేశ్వరి సూచించారు. ఈ క్రమంలో స్టేజీపైకి వచ్చిన నారా బ్రాహ్మణి మాట్లాడుతూ .. చిన్నతనంలో తన తండ్రిని తాను, తన సోదరి తేజు (తేజస్వి) ఇద్దరం అపార్థం చేసుకున్నామని చెప్పింది.
ఆయన ఎప్పుడూ లోపల ఒకటి, బయట ఒకటి మాట్లాడరని, లోపల ఏది అనిపిస్తే అది బయటకు అనేస్తారని, అలా మాట్లాడిన సందర్భాల్లో కొన్ని సార్లు ఏంటి అలా అంటున్నాడు? అని ఆయనను తప్పుగా అర్ధం చేసుకున్నామని చెప్పింది. అయితే ఎదిగిన తర్వాత అలా ఉండటం ఎంత అవసరమో అర్ధమైందని, అలా ఉండటం ఎంత కష్టమో కూడా తమకు తర్వాత అర్ధమైందని బ్రాహ్మణి అన్నారు. తండ్రి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.