Rashid Khan: టీ20ల్లో ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు

Afghanistan bowler Rashid Khan gets world record

  • అంతర్జాతీయ టీ20లు, లీగుల్లో కలిపి 633 వికెట్లు పడగొట్టిన రషీద్ ఖాన్
  • దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ‘ఎస్ఏ20లీగ్‌’లో ఘనత
  • ఐపీఎల్‌లో గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ స్పిన్నర్

ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అత్యంత అరుదైన రికార్డు సృష్టించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఎస్ఏ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ జట్టు తరపున ఆడుతున్న రషీద్.. పార్ల్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు. దీంతో అతడి ఖాతాలో (అంతర్జాతీయ టీ20లు, లీగ్‌లు కలిపి ) మొత్తం 633 వికెట్లు వచ్చి చేరాయి. వీటిలో ఆఫ్ఘనిస్థాన్ తరపున పడగొట్టిన 161 వికెట్లు, దేశవాళీతోపాటు వివిధ లీగ్ మ్యాచుల్లో తీసిన 472 వికెట్లు ఉన్నాయి.

రషీద్ ఖాన్ ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడాడు. కాగా, టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో రెండో స్థానంలో ఉన్నాడు. బ్రావో 582 మ్యాచుల్లో 631 వికెట్లు తీశాడు. 

  • Loading...

More Telugu News