Thandel: 'తండేల్' సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి

- నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తండేల్
- చందు మొండేటి దర్శకత్వంలో చిత్రం
- ఫిబ్రవరి 7న విడుదల
- మల్టీప్లెక్స్ లలో రూ.75, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 వరకు పెంపు
- సినిమా విడుదలైన వారం రోజుల వరకు టికెట్ ధరల పెంపు అమలు
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న చిత్రం తండేల్. ఉత్తరాంధ్రలో కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.
కాగా, ఏపీలో ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. మల్టీప్లెక్స్ లలో రూ.75, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీఎస్టీతో కూడిన ఈ ధరలు సినిమా విడుదలైన రోజు నుంచి వారం రోజుల పాటు అమల్లో ఉంటాయి.
తండేల్ చిత్రబృందం నుంచి వచ్చిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఈ మేరకు టికెట్ రేట్ల పెంపు నిర్ణయం తీసుకుంది.