Nara Lokesh: ఇక ముందు కూడా ఇదే పంథా కొనసాగిద్దాం: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh calls for collective efforts

  • ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ మంత్రి నారా లోకేశ్
  • ఢిల్లీలో లోకేశ్ ను కలిసిన కేంద్ర మంత్రులు రామ్మోహన్, పెమ్మసాని, శ్రీనివాసవర్మ
  • సమష్టి కృషితోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న లోకేశ్
  • కలిసికట్టుగా ఉండటం వల్లే విశాఖ స్టీల్ ను కాపాడుకోగలిగామని వెల్లడి

ఏపీ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో కేంద్ర మంత్రులు శ్రీనివాస వర్మ, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు, బీజేపీ నేతలు మంత్రి లోకేశ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే సమష్టి కృషితో విశాఖ రైల్వే జోన్, అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్ కు నిధులు తెచ్చుకోగలిగామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రులు, ఎంపీలు చేస్తున్న కృషిని లోకేశ్ అభినందించారు. 

అతి తక్కువ కాలంలో విశాఖ స్టీల్ తో సహా అనేక సమస్యల పరిష్కారం కావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని లోకేశ్ అన్నారు. కలిసికట్టుగా ఉండటం వల్లే విశాఖ స్టీల్ ను కాపాడుకోగలిగాం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇక ముందు కూడా ఇదే పంథా కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.

Nara Lokesh
New Delhi
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh
  • Loading...

More Telugu News