Narendra Modi: కేసీఆర్ కు ప్రధాని మోదీ లేఖ

Modi letter to KCR

  • ఇటీవల కన్నుమూసిన కేసీఆర్ సోదరి సకలమ్మ
  • కేసీఆర్ కు సంతాప సందేశాన్ని పంపిన మోదీ
  • ఆమె మరణ వార్తతో దిగ్భ్రాంతి చెందానన్న ప్రధాని

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్క చీటి సకలమ్మ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆమె దశ దిశ కర్మ నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కు ప్రధాని మోదీ సంతాప సందేశాన్ని పంపారు. కేసీఆర్ కు లేఖ రాశారు. అక్క మరణంతో బాధాతప్త హృదయంతో ఉన్న కేసీఆర్ కు, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. సకలమ్మ మరణవార్త తెలుసుకుని దిగ్భ్రాంతి చెందానని చెప్పారు. ఈ ఘటన తనను బాధకు గురి చేసిందని తెలిపారు. ఆమె మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటు అని అన్నారు. సకలమ్మ అనురాగశీలి, మానవీయ దయా గుణాలు కలిగిన గొప్ప వ్యక్తి అని చెప్పారు. 

ఆమె మానవతా విలువలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. కుటుంబ సభ్యులకు ఆమె అందించిన విలువలు, మార్గదర్శనం ప్రేరణగా నిలుస్తాయని చెప్పారు. ఆమెతో గడిపిన మధుర జ్ఞాపకాలు ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని, మనోబలాన్ని ఇస్తాయని అన్నారు. ఆమె మృతి పట్ల సంతాపాన్ని తెలుపుతున్నానని చెప్పారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని అన్నారు. ఈ విషాద క్షణాలను అధిగమించే శక్తి, సహనాన్ని కుటుంబసభ్యులు పొందాలని లేఖలో పేర్కొన్నారు.

Narendra Modi
BJP
KCR
BRS
  • Loading...

More Telugu News