Revanth Reddy: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడంపై రేవంత్ రెడ్డి స్పందన

Revanth reddy reaction on notices to congress MLAs came from BRS

  • ప్రొసీజర్ లో భాగంగానే నోటీసులు ఇచ్చారన్న రేవంత్
  • కులగణన వల్ల బీసీ, ఎస్సీ, మైనార్టీలకు మేలు జరుగుతుందని వ్యాఖ్య
  • బీసీ రిజర్వేషన్లపై కమిషన్ వేశామన్న సీఎం

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ప్రొసీజర్ లో భాగంగానే నోటీసులు జారీ అయ్యాయని చెప్పారు.

కులగణన చేసింది రాజకీయ ప్రయోజనాల కోసం కాదని అన్నారు. 2011 జనాభా లెక్కల తర్వాత మళ్లీ తామే అలాంటి ప్రక్రియ చేపట్టామని చెప్పారు. కులగణన వల్ల 76 శాతం బీసీ, ఎస్సీ, మైనార్టీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. కులగణన చేసి చరిత్ర సృష్టించామని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు బాధ్యత లేదని... ఆ పార్టీని తాము పట్టించుకోబోమని అన్నారు. కోర్టు ఆదేశాలతో బీసీ రిజర్వేషన్లపై కమిషన్ వేశామని... కోర్టు ఆదేశాల మేరకు కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News