KP Vivekananda: బీఆర్ఎస్ పార్టీ విప్‌లుగా కె.పి. వివేకానంద, సత్యవతి రాథోడ్

BRS whips Vivekananda and Satyavathi Rathode

  • శాసన సభలో విప్‌గా కె.పి. వివేకానంద గౌడ్
  • మండలిలో విప్‌గా సత్యవతి రాథోడ్
  • సభాపతికి నియామక పత్రాలు అందజేత

తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్‌లను ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియమించారు. శాసనసభలో బీఆర్ఎస్ విప్‌గా కె.పి. వివేకానంద గౌడ్, మండలిలో విప్‌గా సత్యవతి రాథోడ్‌ను నియమించారు.

కేసీఆర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.టి. రామారావు, పార్టీ ఇతర నేతలు సభాపతికి తెలియజేశారు. ఈ మేరకు నియామక పత్రాలను సభాపతికి అందజేశారు.

కె.పి. వివేకానంద గౌడ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో తెలుగుదేశం పార్టీ నుండి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు.
 

  • Loading...

More Telugu News