Raj Tharun: రాజ్ తరుణ్-లావణ్య కేసులో అరెస్టైన మస్తాన్ సాయి వ్యవహారంలో కొత్త కోణం

New twist in Masthan Sai case

  • మస్తాన్ సాయి 100 మందికి పైగా మహిళలను మోసం చేసినట్లు పోలీసుల అనుమానం
  • అభ్యంతరకర వీడియోలతో మహిళలను బ్లాక్‌మెయిల్ చేసినట్లు గుర్తింపు
  • గతంలో ఫిర్యాదు చేయాలని చూసిన మహిళలకు బెదిరింపు
  • మస్తాన్ సాయి బాధితులు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసుల సూచన

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో అరెస్టయిన మస్తాన్ సాయి వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మస్తాన్ సాయి సుమారు 100 మందికి పైగా మహిళలను మోసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు అభ్యంతరకర వీడియోలతో మహిళలను బ్లాక్‌మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

మహిళలను బ్లాక్‌మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారం చేసినట్లుగా నిర్ధారించారు. యువతులను అసభ్యంగా దూషిస్తూ మానసిక క్షోభకు గురి చేసినట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించిన వారిని కూడా బెదిరించినట్లు గుర్తించారు. మస్తాన్ సాయిని మరోసారి కస్టడీకి తీసుకొని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. మస్తాన్ సాయి బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

  • Loading...

More Telugu News