Bunny Vasu: 'తండేల్' సూపర్ హిట్ అవుతుంది: బన్నీ వాసు

- 'తండేల్' పక్కా లవ్ స్టోరీ అన్న బన్నీ వాసు
- మత్స్యలేశ్యం ఊరుని ఆధారంగా చేసుకుని కథను తయారు చేశామని వెల్లడి
- నాగచైతన్యకు కథ బాగా నచ్చిందన్న వాసు
నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్లో తెరకెక్కిన 'తండేల్' సినిమా ఈ నెల 7న విడుదల అవుతోంది. చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా గురించి నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ... 'తండేల్' సూపర్ హిట్ అవుతుందని చెప్పారు. ఇది పక్కా లవ్ స్టోరీ అని తెలిపారు.
మత్స్యలేశ్యం అనే ఊరుని బేస్ చేసుకుని కథను తయారు చేసినట్టు చెప్పారు. అక్కడి వారు చేపల వేట కోసం గుజరాత్ పోర్ట్ కి వెళతారని... వారి ప్రధాన నాయకుడిని తండేల్ అంటారని తెలిపారు. తండేల్ అనేది గుజరాతీ పదమని చెప్పారు. కథా రచయిత కార్తీక్ ది మత్స్యలేశ్యం పక్క ఊరని తెలిపారు. అక్కడ జరిగిన ఘటనల ఆధారంగా కథను తయారు చేశారని చెప్పారు.
నాగచైతన్యకు చిత్రకథ బాగా నచ్చిందని బన్నీ వాసు తెలిపారు. చేపలు పట్టే వాడి పాత్రలో చైతూ పరకాయప్రవేశం చేశాడని చెప్పారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇది విడుదలవుతోందని తెలిపారు.