woman donates: టీటీడీ విద్యా సంస్థలకు మహిళ భారీ విరాళం

woman donates 50 Lac to ttd

  • భారత్ సహా పలు దేశాల్లో అభివృద్ధి – విపత్తు నిర్వహణ రంగాల్లో సేవలు అందించిన సి.మోహన
  • టీటీడీకి రూ.50 లక్షల చెక్కు అందజేత
  • అనాథ, పేద పిల్లల సంక్షేమానికి వినియోగించాలని కోరిన మోహన

టీటీడీ విద్యాసంస్థల్లో చదువుతున్న అనాధ, పేద పిల్లల సంక్షేమానికి ఒక మహిళ భారీ విరాళాన్ని అందించారు. అల్బేనియా, యెమెన్, సౌదీ అరేబియా తదితర దేశాల్లో అభివృద్ధి – విపత్తు నిర్వహణ రంగాల్లో వివిధ హోదాల్లో పని చేసిన రేణిగుంటకు చెందిన సి.మోహన.. తను పొదుపు చేసిన రూ.50 లక్షలను తిరుమల శ్రీవారికి కానుకగా సమర్పించారు.  

టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి విరాళం చెక్కు అందజేసిన ఆమె .. ఈ నిధులను టీటీడీ విద్యాసంస్థల్లో చదువుతున్న అనాథ, పేద పిల్లల సంక్షేమానికి వినియోగించాలని కోరారు. 
 

  • Loading...

More Telugu News