Jio: జియోలో అదిరిపోయే మూడు టాప్ ప్లాన్స్ ఇవే!

top three tariffs from Jio

  • రూ. 349 రీఛార్జ్ ప్లాన్‌తో ప్రతిరోజూ 2 జీబీ డేటా
  • రూ. 749 ప్లాన్‌తో 72 రోజుల పాటు అపరిమిత కాల్స్, 2 జీబీ డేటా
  • రూ. 3,599 రీఛార్జ్ ప్లాన్‌లో అపరిమిత 5జీ డేటా సౌకర్యం

రిలయన్స్ జియో ఇటీవల టారిఫ్ ఛార్జీలను పెంచింది. అయినప్పటికీ పలు సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. జియో తక్కువ ధరకే అందించే మూడు ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం... అందులో రూ. 349 రీఛార్జ్ ప్లాన్, రూ. 749 రీఛార్జ్ ప్లాన్, రూ. 3,599 రీఛార్జ్ ప్లాన్ ఉన్నాయి.

జియో రూ. 349 రీఛార్జ్ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో ప్రతిరోజూ 2 జీబీ డేటా వస్తుంది. 

జియో రూ.749 రీఛార్జ్ ప్లాన్ వాలిడిటీ 72 రోజులు. ఈ ప్లాన్‌లో అపరిమిత 5జీ డేటా, కాలింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌‌లో ప్రతిరోజూ 2 జీబీ (4జీ స్పీడ్) డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో 20జీబీ అదనపు డేటా అందుబాటులో ఉంది. జియో 5జీబీ నెట్ వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులు అపరిమిత 5జీ ఇంటర్నెట్ పొందవచ్చు.

జియో రూ. 3,599 రీఛార్జ్ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. అపరిమిత 5జీ డేటా సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్‌లో రిలయన్స్ జియో కస్టమర్లు ప్రతిరోజూ 2.5 జీబీ (4జీ స్పీడ్) డేటాను పొందుతారు.

Jio
Reliance
Mobile Phone
  • Loading...

More Telugu News