AP and TG: ఉమ్మడి ఏపీ విభజన సమస్యలపై కేంద్ర హోం శాఖ కార్యాలయంలో కీలక సమావేశం

A key meeting was held at the Central Home Department office on the issues of division of AP

  • సమావేశానికి హాజరైన రెండు రాష్ట్రాల సీఎస్ లు
  • పరిష్కారం కాని ప్రధాన అంశాలపై చర్చ
  • విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కూడా చర్చ

ఉమ్మడి ఏపీ విభజన అంశాల్లో ఎన్నో అంశాలు ఇంకా పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని కేంద్ర హోం శాఖ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోం శాఖ కీలక అధికారులు, ఏపీ, తెలంగాణ చీఫ్ సెక్రటరీలు, ఇతర అధికారులు హాజరయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని ప్రధాన అంశాలపై అధికారులు చర్చిస్తున్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కూడా వీరు చర్చలు జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News