Anasuya: ఒక స్టార్ హీరోకి 'నో' చెప్పాను: అనసూయ

I said no toone hero says Anasuya

  • ఒక పెద్ద డైరెక్టర్ అడిగితే సున్నితంగా తిరస్కరించానన్న అనసూయ
  • అఫర్ల పేరుతో అమ్మాయిలను హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు వాడుకోవాలని ప్రయత్నిస్తారని వ్యాఖ్య
  • ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తనకు ఎన్నో ప్రపోజల్స్ వచ్చాయన్న అనసూయ

సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే ఎంతో మంది బహిరంగంగా మాట్లాడారు. లైంగిక వేధింపుల గురించి పలువురు నటీమణులు తమ అనుభవాలను వెల్లడించారు. తాజాగా సినీ నటి అనసూయ ఈ అంశంపై మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించారు. 

ఓ స్టార్ హీరో అడిగితే తాను 'నో' చెప్పానని అనసూయ వెల్లడించారు. అదే విధంగా ఒక పెద్ద డైరెక్టర్ కూడా అడిగితే సున్నితంగా తిరస్కరించానని చెప్పారు. దీనివల్ల తాను పలు ఆఫర్లను కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. నో చెప్పడమే కాదు... దాని వల్ల వచ్చే సమస్యలను కూడా ఎదుర్కొనే ధైర్యం అమ్మాయిల్లో ఉండాలని సూచించారు. అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలను హీరోలతో పాటు దర్శకులు, నిర్మాతలు వాడుకోవడానికి ప్రయత్నిస్తారని తెలిపారు. 

స్కూల్లో చదువుకునే రోజుల్లోనే తనకు ప్రపోజ్ చేశారని... తాను తిరస్కరించానని అనసూయ చెప్పారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎన్నో ప్రపోజల్స్ వచ్చాయని తెలిపారు. అమ్మాయిలు కూడా ఈజీ వేలో ఛాన్సులు రావాలని కాకుండా... కష్టాన్ని నమ్ముకుని ప్రయత్నించాలని అనసూయ సూచించింది.

తనను ఇష్టపడే వాళ్ల కోసం సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తుంటానని చెప్పింది. అయితే, తాను ఎలాంటి దుస్తులు వేసుకోవాలనేది తన ఇష్టమని తెలిపింది. తాను ఫుల్ డ్రెస్ వేసుకోవాలా? లేక బికినీ వేసుకోవాలా? అనేది తన ఇష్టమని చెప్పింది. తనపై మీ పెత్తనమేంటని నెటిజన్లపై ఫైర్ అయింది.

Anasuya
Tollywood
Casting Couch
  • Loading...

More Telugu News