Brahmanandam: ఇన్స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మానందం... క్షణాల్లోనే భారీగా ఫాలోయర్స్!

Brahmanandam enters Instaram

  • నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్న బ్రహ్మి
  • తాజాగా ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మానందం
  • ఇన్స్టాలో బ్రాహ్మీకి లక్షన్నరకు పైగా ఫాలోయర్లు

తెలుగు సినీ పరిశ్రమలోని దిగ్గజాల్లో బ్రహ్మానందం ఒకరు. నాలుగు దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూనే ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో బ్రహ్మానందం లేని మీమ్ కంటెంట్ ను ఊహించుకోలేము. అలాంటి బ్రహ్మి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఖాతా తెరిచారు. బ్రహ్మానందం ఇన్స్టాలోకి వచ్చిన క్షణాల్లోనే ఆయనను ఫాలో అయ్యేవారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. లక్షన్నరకు పైగా ఆయనను ఫాలో అవుతున్నారు.      

Brahmanandam
Tollywood
Instagram
  • Loading...

More Telugu News