NTR Trust: ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఏం తినాలి?... ఎన్టీఆర్ ట్రస్ట్ ఏం చెబుతోందంటే...!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పేదలకు చేయూత, ఆర్థిక ఇబ్బందులతో చదువుకోలేని వారికి సాయం చేయడం, నిరుపేదల పిల్లల కోసం ప్రత్యేకంగా విద్యాసంస్థలు నిర్వహించడం, వివిధ రకాల హెల్త్ క్యాంపులు, మహిళా సాధికారత కోసం పలు కార్యక్రమాలు చేపట్టడం... ఇలా ఎన్టీఆర్ ట్రస్ట్ సామాజిక సేవలో ముందుకు వెళుతోంది.
తాజాగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ట్రస్ట్... ఆరోగ్యానికి సంబంధించి ఆసక్తికర సమాచారం పంచుకుంది. సాధారణ ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు ఏమి తినాలి? అంటూ పలు రకాల అనారోగ్యాలకు సరైన ఆహారం ఏమిటనేది ఆ పోస్టులో పేర్కొన్నారు.
బలహీనంగా ఉన్నవారు, హైబీపీ ఉన్నవారు ఏం తినాలి? కంటి ఆరోగ్యం కోసం ఏం తినాలి? రక్తహీనతకు మంచి ఆహారం ఏది? బరువు తగ్గడానికి ఏం తినాలి? గుండె ఆరోగ్యం కోసం ఏది మంచి ఆహారం? ఇలా అనేక అంశాలను వివరించారు.
