Abhishek Sharma: ఐదో టీ20.... వాంఖెడే స్టేడియంలో అభిషేక్ శర్మ సిక్సర్ల మోత

Team India gets flying start in 5th T20

 


టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య నామమాత్రపు ఐదో టీ20 మ్యాచ్ ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే సిరీస్ గెలుచుకున్న టీమిండియా... ఈ మ్యాచ్ లో ధాటిగా బ్యాటింగ్ చేస్తోంది.

యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 17 బంతుల్లోనే 50 పరుగులు చేసిన ఈ డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్ టీమిండియా తరఫున రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. మరో ఎండ్ లో తిలక్ వర్మ కూడా రెచ్చిపోయి ఆడుతుండడంతో టీమిండియా స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అంతకుముందు, ఓపెనర్ సంజు శాంసన్ కూడా దూకుడుగా ఆడే ప్రయత్నంలో అవుటయ్యాడు. శాంసన్ 7 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 16 పరుగులు చేశాడు. 

ఆ తర్వాత అభిషేక్ శర్మ, తిలక్ వర్మ జోడీ ఇంగ్లండ్ బౌలింగ్ ను ఊచకోత కోసింది. ప్రస్తుతం టీమిండియా స్కోరు 8 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 127 పరుగులు. అభిషేక్ శర్మ 29 బంతుల్లో 86 పరుగులు... తిలక్ వర్మ 12 బంతుల్లో 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. అభిషేక్ శర్మ స్కోరులో 4 ఫోర్లు, 9 సిక్సులు ఉండగా... తిలక్ వర్మ స్కోరులో 3 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి.

  • Loading...

More Telugu News