Jeevan Reddy: ఇది భారత బడ్జెట్టా, లేక బీహార్ బడ్జెట్టా?: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

- నిన్న కేంద్ర బడ్జెట్ ప్రకటన
- బీహార్ కు అత్యధిక కేటాయింపులు చేశారంటూ కాంగ్రెస్ విమర్శలు
- తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వరా అంటూ జీవన్ రెడ్డి ఆగ్రహం
బీహార్ లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో, ఆ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో అత్యధిక కేటాయింపులు చేశారని బీజేపీపై విపక్ష కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు.
ఇది భారత బడ్జెట్టా లేక బీహార్ బడ్జెట్టా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వరా? అని మండిపడ్డారు. మెట్రో రైలు విస్తరణ అంశంపై కిషన్ రెడ్డికి బాధ్యత లేదా? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఇటీవల పసుపు బోర్డు ప్రకటించారని, కానీ బడ్జెట్ లో దానికి సంబంధించి ఎలాంటి నిధులు ప్రకటించలేదని విమర్శించారు.