Maha Kumbh Mela: కుంభమేళాలో కోల్డ్ ప్లే సింగర్... ఈవెంట్ కోసం కాదు పుణ్య స్నానం కోసమే... వీడియో ఇదిగో!

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు ఆదివారం ఓ ప్రత్యేక అతిథి హాజరయ్యారు. కోల్డ్ ప్లే కాన్సర్ట్ లలో తన పాటలతో యూత్ ను ఉర్రూతలూగిస్తున్న సింగర్ క్రిస్ మార్టిన్ శనివారం కుంభమేళాలో పాల్గొన్నారు.
తన స్నేహితురాలు డకోటా జాన్సన్ తో కలిసి మహాకుంభ్ నగర్ కు చేరుకున్న క్రిస్ మార్టిన్... త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేశారు. ఈ జంట పుణ్య స్నానం చేస్తూ మహా శివుడికి నమస్కరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొనడంపై క్రిస్ మార్టిన్ సంతోషం వ్యక్తం చేశారు.
కాగా, ఇటీవల దేశంలోని వివిధ నగరాలలో కోల్డ్ ప్లే సంగీత కచేరీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాలతో క్రిస్ మార్టిన్ బాగా పాప్యులర్ అయ్యారు. ముంబై, గుజరాత్ లలో జరిగిన షోలకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే క్రిస్ మార్టిన్, డకోటా జాన్సన్ కుంభమేళాలో పాల్గొని పుణ్య స్నానం చేశారు.