janhvi kapoor: జాన్వీ కపూర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యాపారవేత్త

- కండోమ్ ప్రచారానికి జాన్వీ కపూర్ బెస్ట్ అంటూ వ్యాఖ్యలు చేసిన మాన్ ఫోర్స్ సంస్థ ఫౌండర్ రాజీవ్ జునేజా
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజీవ్ జునేజా వ్యాఖ్యలు
- రాజీవ్ జునేజాపై మండిపడుతున్న జాన్వీ కపూర్ అభిమానులు
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌పై ఓ కండోమ్ కంపెనీ అధినేత అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సదరు కంపెనీ అధినేతపై జాన్వీ కపూర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిసోంది. అక్కడ అవకాశాలు రాకపోవడంతో దక్షిణాది చిత్ర పరిశ్రమపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఇక్కడ వరుస అవకాశాలను అందుకుంటూ బిజీ హీరోయిన్‌గా మారింది. ఈ నేపథ్యంలో మాన్ ఫోర్స్ సంస్థ వ్యవస్థాపకుడు రాజీవ్ జునేజా ఒక ఇంటర్వ్యూలో కపూర్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమ బ్రాండ్ కండోమ్ ప్రకటనకు జాన్వీ కపూర్, రణబీర్ కపూర్ సరైన ఎంపిక అని, వీరిద్దరూ కలిసి ప్రకటనలో నటిస్తే విశేష ఆదరణ లభిస్తుందని ఆయన అన్నారు.
అయితే, జాన్వీ కపూర్ అనుమతి లేకుండా రాజీవ్ ఆమె పేరును ప్రస్తావించడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఒక మహిళా నటిని కండోమ్ ప్రచారానికి ఎలా ఎంపిక చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ఆయన ఉద్దేశం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జాన్వీ కపూర్‌కు శృంగారపరమైన ఇమేజ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారా అంటూ అభిమానులు నిలదీస్తున్నారు.