Sankranthiki Vasthunam: 'సంక్రాంతికి' ముందు రూ. 10 కోట్లు.. 'సంక్రాంతి' తరువాత రూ.25 కోట్లు!

Before Sankranti  10 crores 25 crores after Sankranti

  • సీనియర్‌ హీరోల్లో వెంకటేష్‌ సరికొత్త రికార్డు 
  • తదుపరి చిత్రం కోసం వెంకీ పారితోషికం రూ.25 కోట్లు 
  • రూ.300 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం'

తెలుగు సినిమా అగ్ర నటులుగా, సీనియర్ హీరోలుగా పరిగణించబడే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునల మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ నేటి హీరోలతో పోల్చుకుంటే ప్రత్యేకం. ఈ నలుగురు హీరోలకు కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి గుర్తింపు ఉంది. నేటి తరం హీరోలతో పోల్చుకుంటే ఈ హీరోలు ఎంచుకునే సినిమాల కథలు కూడా భిన్నంగానే ఉంటాయి. ఇక పారితోషికాల విషయాల్లో కూడా నేటి తరం యువ స్టార్ హీరోలతో కంపేర్ చేస్తే మోస్ట్ ఫ్రెండ్లీ రెమ్యూనరేషన్స్ అందుకుంటారు.

అయితే ఇప్పుడు ఈ జాబితాలోని వెంకటేష్ ఏకంగా తన తదుపరి చిత్రం కోసం రూ.25 కోట్ల పారితోషికం అందుకోబోతున్నారని సమాచారం. ఇటీవల ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. వెంకటేష్‌కు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి గుర్తింపు ఉంది. ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల ఆదరణతో బ్లాక్‌బస్టర్ విజయంగా నిలిచింది. రూ. 60 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.300 కోట్ల రూపాయల వసూళ్లను సాధించిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

అందుకే 'సంక్రాంతి వస్తున్నాం' చిత్రం వరకు 10 నుంచి 12 కోట్ల రెమ్యూనరేషన్‌ను అందుకున్న ఈ దగ్గుబాటి హీరో తన తదుపరి చిత్రానికి రూ.25 కోట్లు తీసుకుంటున్నాడని తెలిసింది. 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంతో తెలుగు సీనియర్ హీరోల్లో తొలిసారిగా రూ.300 కోట్ల వసూళ్లను సాధించిన హీరోగా వెంకటేష్ కొత్త రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. 

  • Loading...

More Telugu News