Chandrababu: కంగ్రాట్స్ పల్లవి... ఏపీ వెయిట్ లిఫ్టర్ కు చంద్రబాబు అభినందనలు

Chandrababu congratulates AP weight lifter Pallavi clinched gold in National Games

  • ఉత్తరాఖండ్ లో 38వ జాతీయ క్రీడలు
  • సత్తా చాటుతున్న ఏపీ వెయిట్ లిఫ్టర్లు
  • నిన్న పురుషుల 67 కిలోల కేటగిరీలో నీలం రాజుకు స్వర్ణం
  • నేడు మహిళల 71 కిలోల విభాగంలో పల్లవికి గోల్డ్ మెడల్

ఉత్తరాఖండ్ లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో ఏపీ వెయిట్ లిఫ్టర్లు సత్తా చాటుతున్నారు. నిన్న పురుషుల విభాగం 67 కిలోల కేటగిరీలో రాష్ట్రానికి చెందిన కె. నీలం రాజు స్వర్ణ పతకం సాధించగా... నేడు మహిళల విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన ఎస్. పల్లవి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. 

దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. కంగ్రాచ్యులేషన్స్ పల్లవి... అని అభినందనలు తెలిపారు. విజయనగరం నుంచి వచ్చిన మన రాష్ట్ర పుత్రిక... 71 కిలోల విభాగంలో స్వర్ణం గెలిచింది అని వెల్లడించారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు.

More Telugu News