Kethireddy: జగన్, పవన్, చిరంజీవి, బాలకృష్ణలపై కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Kethireddy comments on Jagan Pawan Chiranjeevi Balakrishna

  • జగన్, పవన్ కి ఫాలోయింగ్ ఎక్కువగా ఉందన్న కేతిరెడ్డి
  • హిందూపురం కాబట్టి బాలకృష్ణ మూడుసార్లు గెలిచారని వ్యాఖ్య
  • చిరంజీవి సొంత నియోజకవర్గంలో ఓడిపోయారన్న కేతిరెడ్డి

జగన్, పవన్ కల్యాణ్, చిరంజీవి, బాలకృష్ణలను ఉద్దేశించి వైసీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఇద్దరికే ఎక్కువ ఫాలోయింగ్ ఉందని... వీరు రాజకీయాల్లో జగన్, సినిమాల్లో పవన్ కల్యాణ్ అని చెప్పారు. వీరిద్దరూ వస్తే 10 నిమిషాల్లో 10 వేల మంది జనాలు పోగవుతారని అన్నారు. వీరి మీద ప్రేమతో జనాలు వస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుది అంతా మేనేజ్ మెంట్ అని అన్నారు.

హిందూపురంలో కాబట్టి బాలకృష్ణ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని... గుడివాడలో అయితే మూడుసార్లు గెలవలేరని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి కూడా రెండు చోట్ల పోటీ చేస్తే... తిరుపతిలో గెలిచారని, సొంత నియోజకవర్గం పాలకొల్లులో ఓడిపోయారని అన్నారు. 

  • Loading...

More Telugu News