Union Budget 2025-26: పొరుగు దేశాలకు కూడా మన బడ్జెట్ లో కేటాయింపులు... వివరాలు ఇవిగో!

Centre allocated funds to small countries in our budget

  • బడ్జెట్ ప్రవేశపెట్టిన ఎన్డీయే 3.0 సర్కారు
  • పొరుగు దేశాలకు కూడా బడ్జెట్ లో కేటాయింపులు
  • అత్యధికంగా భూటాన్ కు రూ.2,150 కోట్లు
  • అత్యల్పంగా మంగోలియాకు రూ.5 కోట్లు 

ఎన్డీయే 3.0 ప్రభుత్వం నేడు వార్షిక బడ్జెట్ ప్రకటన చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ కేంద్ర బడ్జెట్ లో మన పొరుగున ఉన్న పలు చిన్న దేశాలకు కూడా కేటాయింపులు చేశారు. 

అత్యధికంగా భూటాన్ కు రూ.2,150 కోట్లు కేటాయించారు. మాల్దీవులకు రూ.600 కోట్లు, బంగ్లాదేశ్ కు రూ.120 కోట్లు కేటాయించారు. అత్యల్పంగా మంగోలియాకు రూ.5 కోట్లు కేటాయించారు. కాగా, మాల్దీవులకు గతేడాది బడ్జెట్ లో రూ.470 కోట్లు కేటాయించగా, ఈసారి కేటాయింపులు పెంచారు.

Union Budget 2025-26
Neighbour Countires
Allocations
India
  • Loading...

More Telugu News