Sai Pallavi: విశ్రాంతి తీసుకోవాలంటూ సాయిపల్లవికి డాక్టర్ల సూచన

Sai Pallavi advised to take rest by doctors

  • జ్వరం, జలుబుతో బాధ పడుతున్న సాయిపల్లవి
  • రెండు రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యుల సూచన
  • అనారోగ్యం కారణంగా 'తండేల్' ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొనలేకపోయిన సాయిపల్లవి

ప్రముఖ సినీ నటి సాయిపల్లవి అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని దర్శకుడు చందు మొండేటి వెల్లడించారు. సాయి పల్లవి కొన్ని రోజుల నుంచి జ్వరం, జలుబుతో బాధ పడుతున్నారని తెలిపారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆమె 'తండేల్' సినిమాకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారని... దీంతో ఆమె మరింత నీరసించిపోయారని చెప్పారు. కనీసం రెండు రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని ఆమెకు డాక్టర్లు సూచించారని తెలిపారు. ఈ కారణం వల్లే ముంబైలో జరిగిన 'తండేల్' ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సాయిపల్లవి పాల్గొనలేకపోయారని చెప్పారు. 

'తండేల్' సినిమా విషయానికి వస్తే... ఈ చిత్రంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వం వహించారు. బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకు... అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. 'లవ్ స్టోరీ' తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో... ఈ చిత్రంపై అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి.

  • Loading...

More Telugu News