Budget 2025: బ‌డ్జెట్‌-2025: ధ‌ర‌లు పెరిగేవి... ధ‌ర‌లు త‌గ్గేవి ఇవే...!

Whats Cheaper and What is Costlier After Budget 2025

  • ఈ బడ్జెట్ లో కేంద్రం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు 
  • పన్ను మినహాయింపులు ప్రకటించిన ప్రభుత్వం
  • అలాగే ఎగుమతి, దిగుమతులపై సుంకాల మార్పులతో పలు వస్తువుల ధరలు ప్రభావితం
  • దాంతో పలు వస్తువుల ధరలు పెరిగితే... మరికొన్నింటి ధ‌ర‌లు తగ్గే అవ‌కాశం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వసారి బడ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. ఇక ఈ బడ్జెట్ లో కేంద్రం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ప్రభుత్వం ప్రకటించిన పన్ను మినహాయింపులు... అలాగే ఎగుమతి, దిగుమతులపై సుంకాల మార్పులతో పలు వస్తువుల ధరలు ప్రభావితం కానున్నాయి. దాంతో పలు వస్తువుల ధరలు పెరుగుతాయి. మరికొన్నింటి ధ‌ర‌లు తగ్గుతాయి. వాటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ధరలు తగ్గేవి:
క్యాన్సర్, అరుదైన వ్యాధుల‌ మందులు
ప్రాణాలను రక్షించే మందులు
ఫ్రోజెన్ చేపలు
ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు
చేపల పేస్ట్
తోలు వస్తువులు 
క్యారియర్-గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్‌లు
12 కీలకమైన ఖనిజాలు
ఓపెన్ సెల్
భారతదేశంలో తయారైన దుస్తులు
మొబైల్ ఫోన్లు
వైద్య పరికరాలు
ఎల్‌సీడీ, ఎల్ఈడీ టీవీలు

ధరలు పెరిగేవి..
ఫ్లాట్ ప్యానెల్ డిస్ ప్లే
సిగరెట్లు

  • Loading...

More Telugu News