Araku Utsav 2025: ఘ‌నంగా అర‌కు ఉత్సవ్‌.. పాట పాడిన క‌లెక్ట‌ర్‌ అభిషేక్.. డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టిన మ‌రో ఐఏఎస్ అధికారి!

Three Day Araku Utsav 2025 Celebrations

  • అరకులోయలో ‘చలి ఉత్సవ్‌-25’ 
  • 'నీలి నీలి ఆకాశం' పాట పాడి అలరించిన ఐఏఎస్ అధికారి అభిషేక్
  • డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టిన క‌లెక్ట‌ర్ దినేశ్‌కుమార్‌  

అల్లూరి జిల్లాలో పర్యాటక ప్రాంతమైన అరకులో చలి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అరకులోయలో ‘చలి ఉత్సవ్‌-25’ శుక్రవారం ఘనంగా ప్రారంభమైన విష‌యం తెలిసిందే. జిల్లా కలెక్టర్‌ ఎ.ఎస్‌. దినేశ్‌ కుమార్‌ ఉత్సవ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో చలి ఉత్సవాలు జ‌రుగుతున్నాయి. 

గిరిజన ప్రాంతాల ఆహార, వాణిజ్య పంటల ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో 7 రాష్ట్రాల కళాకారులు పాల్గొన్నారు. ఐఏఎస్ అధికారులు పాల్గొని గులాబీ తలపాగా చుట్టుకుని నృత్యం చేశారు. అలాగే ఐఏఎస్ అధికారి అభిషేక్ గొంతు సవ‌రించ‌డం హైలైట్‌గా నిలిచింది. 

30 రోజుల్లో ప్రేమించ‌డం ఏలా సినిమాలోని నీలి నీలి ఆకాశం పాట ఆల‌పించారాయ‌న‌. మూడు రోజులపాటు నిర్వహించే అరకు ఉత్సవ్‌ను స్థానికులు, పర్యాటకులు ఆస్వాదించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. శని, ఆదివారాల్లో అధిక సంఖ్యలో పర్యాటకులు విచ్చేస్తారని అధికారులు భావిస్తున్నారు.

More Telugu News