Naga Chaitanya: నేను కాస్త ఒత్తిడికి గురైనా ఆమెకు తెలిసిపోతుంది: నాగచైతన్య

- శోభితతో జీవితాన్ని పంచుకోవడం సంతోషంగా ఉందన్న చైతూ
- ప్రతి విషయం తనతో షేర్ చేసుకుంటుందని వెల్లడి
- ఆమె అభిప్రాయాలు పర్ఫెక్ట్ గా ఉంటాయని ప్రశంస
సినీ నటి శోభితను హీరో నాగచైతన్య ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూ మాట్లాడుతూ... తన భార్యపై ప్రశంసలు కురిపించాడు. శోభితతో జీవితాన్ని పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు. తన ఆలోచనలన్నీ ఆమెతో చెపుతుంటానని... ఆమె కూడా తనతో అన్ని విషయాలను షేర్ చేసుకుంటుందని తెలిపాడు. తాను ఎప్పుడైనా గందరగోళానికి గురైతే శోభితతో మాట్లాడతానని... ఆ సమయంలో ఆమె తనకు ఎంతో సపోర్ట్ గా ఉంటుందని చెప్పాడు.
తాను కాస్త ఒత్తిడికి గురైనా ఆమెకు తెలిసిపోతుందని చైతూ తెలిపాడు. ప్రతి విషయంలో ఆమె తనకు సలహాలు, సూచనలు ఇస్తుంటుందని చెప్పాడు. ఆమె అభిప్రాయాలు పర్ఫెక్ట్ గా ఉంటాయని ప్రశంసించాడు. ఆమె నిర్ణయాలను, అభిప్రాయాలను తాను ఎంతో గౌరవిస్తానని చెప్పాడు. తన విషయంలో ప్రతిదీ ఆమె నిర్ణయం తర్వాతే కార్యరూపం దాలుస్తుందని తెలిపాడు.
శోభిత 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గా నిలిచింది. 2016లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో నటించింది. హాలీవుడ్ లో కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. నాగచైతన్య విషయానికి వస్తే... ప్రస్తుతం తన తాజా చిత్రం 'తండేల్' ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో చైతూకి జోడీగా సాయిపల్లవి నటించింది. ఈ నెల 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
