Allu Arjun: తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా అల్లు అర్జున్

- నేడు హైదరాబాద్‌లో నాగ చైతన్య ‘తండేల్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
- ముఖ్య అతిధిగా పాల్గొంటున్న అల్లు అర్జున్
- ‘పుష్ప2’లోని బన్నీ లుక్‌తో కూడిన స్పెషల్ పోస్టర్ విడుదల చేసిన తండేల్ చిత్ర బృందం
నాగ చైతన్యతో దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన చిత్రం 'తండేల్'. ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమంలో భాగంగా చిత్ర యూనిట్ వివిధ నగరాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లను నిర్వహిస్తోంది. కాగా, 'తండేల్' చిత్రం ప్రచార కార్యక్రమంలో అల్లు అర్జున్ పాల్గొననున్నారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బన్నీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది. ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం 'తండేల్ జాతర' పేరుతో ఈ వేడుక జరగనుంది. ఈ మేరకు ‘పుష్ప 2’లోని బన్నీ లుక్‌తో కూడిన ప్రత్యేక పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
చిత్ర బృందం ప్రచారంలో భాగంగా ఇప్పటికే విశాఖపట్నంలో తెలుగు ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. చెన్నైలో గురువారం నిర్వహించిన వేడుకలో తమిళ ట్రైలర్‌ను విడుదల చేసింది. నిన్న ముంబయిలో హిందీ ట్రైలర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.