Marco: ఓటీటీలోకి వస్తున్న మలయాళ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్

Malyalam biggest action thriller Marco will stream on OTT from Feb 14

  • ఉన్ని ముకుందన్ హీరోగా మార్కో
  • హనీఫ్ అదేని దర్శకత్వంలో చిత్రం
  • ఫిబ్రవరి 14 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ 

మలయాళ చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా విజయాన్ని అందుకున్న మార్కో చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఉన్నిముకుందన్ ప్రధాన పాత్రలో హనీఫ్ అదేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మార్కో చిత్రం ఫిబ్రవరి 14 నుంచి సోనీ లివ్ ఓటీటీ వేదికపై స్ట్రీమింగ్ కానుంది. 

క్యూబ్స్ ఎంటర్టయిన్ మెంట్స్, ఉన్నిముకుందన్ ఫిలింస్ పతాకాలపై షరీఫ్ మహ్మద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్కో చిత్రం గతేడాది డిసెంబరు 20న థియేటర్లలోకి వచ్చింది. 

తొలుత మలయాళం, హిందీ వెర్షన్లలో ప్రజాదరణ పొందిన ఈ చిత్రం... తర్వాత తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజైంది. కొన్ని రోజుల కిందటే కన్నడంలోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

  • Loading...

More Telugu News