Ajith: సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న అజిత్ 'పట్టుదల'

Ajith starring Pattudala movie completes censor work

  • అజిత్, త్రిష జంటగా పట్టుదల
  • మగిళ్ తిరుమేని దర్శకత్వంలో చిత్రం
  • పిబ్రవరి 6న గ్రాండ్ రిలీజ్
  • U/A సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు

తమిళ స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా మగిళ్ తిరుమేని దర్శకత్వంలో వస్తున్న చిత్రం విడా ముయార్చి. ఈ చిత్రం తెలుగులో పట్టుదల పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. 

తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. పట్టుదల చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ చిత్రం ఫిబ్రవరి 6న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అజిత్ సరసన త్రిష కథానాయిక. అర్జున్, రెజీనా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.

  • Loading...

More Telugu News