K.Neelam Raju: వెయిట్ లిఫ్టర్ నీలం రాజుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అభినందనలు

- ఉత్తరాఖండ్ లో 38వ జాతీయ క్రీడలు
- వెయిట్ లిఫ్టింగ్ లో 67 కిలోల కేటగిరీలో నీలం రాజుకు గోల్డ్ మెడల్
- రాష్ట్రాన్ని గర్వించేలా చేశావంటూ సీఎం చంద్రబాబు ట్వీట్
ఉత్తరాఖండ్ లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో ఏపీ వెయిట్ లిఫ్టర్ నీలం రాజు పసిడి పతకంతో సత్తా చాటాడు. దీనిపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.
"38వ జాతీయ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ క్రీడాంశం 67 కిలోల కేటగిరీలో గోల్డ్ మెడల్ గెలుచుకున్న ఏపీకి చెందిన కె. నీలం రాజుకు హృదయపూర్వక అభినందనలు. నీ అంకితభావం, కఠోర శ్రమ మన రాష్ట్రాన్ని గర్వించేలా చేశాయి. భవిష్యత్తులోనూ నువ్వు ఇలాంటి విజయాలు మరెన్నో అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
అటు, మంత్రి నారా లోకేశ్ కూడా నీలం రాజు పసిడి ప్రదర్శన పట్ల స్పందించారు. ఏపీకి చెందిన నీలం రాజు జాతీయ క్రీడల్లో స్వర్ణం గెలవడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ 67 కిలోల కేటగిరీలో నీలం రాజు పసిడి గెలిచాడని వెల్లడించారు. ఏపీ నుంచి వెలుగు చూస్తున్న ప్రతిభకు ఇది నిజమైన నిదర్శనం అని, ఇలాగే రాణిస్తుండాలని కోరుకుంటున్నామని లోకేశ్ పేర్కొన్నారు.
